Banavat Gobind Naik: జిల్లా ఏజెన్సీ లకే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల బాధ్యతలు అప్పగించాలి : బానవత్ గోవింద్ నాయక్

సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
జిల్లా ఏజెన్సీ లకే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల బాధ్యతలు అప్పగించాలి : బానవత్ గోవింద్ నాయక్
* క‌లెక్ట‌ర్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేత‌

నిర్మల్ జిల్లా ఏజెన్సీ లకే జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల బాధ్యతలు అప్పగించాల‌ని కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు బానవత్ గోవింద్ నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర జిల్లా వారికి జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల బాధ్య‌తలు అప్పగిస్తే నిర్మల్ జిల్లా ఏజెన్సీ లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. మరో వైపు ఇతర జిల్లా వాళ్లకు ఏజెన్సీలు కట్టబెడితే ఈపీఎఫ్ డబ్బుల్లో కూడా గందరగోళం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కిషన్ సెల్ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్ కాంబ్లే ,పట్టణ కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు రాథోడ్ అంబాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *