సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలి: బానావత్ గోవింద్
ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక నిర్మల్ జిల్లా అధ్యక్షులు బానావత్ గోవింద్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలలో ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితులపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపి ఎస్సీ, ఎస్టీలకు తగు న్యాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కుల గణన కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కులగణన చేస్తున్న సందర్భంలో కులగణన ఆధారంగా మెజారిటీగా ఉన్న సామాజిక వర్గాల జనాభా ప్రాతిపదిక గ్రామపంచాయతీలో రిజర్వేషన్ కేటాయించాలన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏజెన్సీ ప్రాంతాలలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ వార్డు సభ్యుల రిజర్వేషన్ కేటాయించారని, కానీ 2019 పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఏజెన్సీ గ్రామ పంచాయితీలలో ఎస్సీ వార్డు సభ్యుల రిజర్వేషన్ తొలగించారన్నారు. వెంటనే ఈ ఏజెన్సీలో ఎస్సీ వార్డు సభ్యుల రిజర్వేషన్ మళ్లీ కేటాయించాలని తెలిపారు. జనాభా ప్రతిపాదికన 80, 90% శాతం గిరిజనులు ఉన్న అలాంటి గ్రామాలకు ఏజెన్సీ చట్టాన్ని వర్తింపచేసి గిరిజనులకు న్యాయం జరిగేలా చేయాలని మాట్లాడారు. ఈ సమస్యలపై ప్రభుత్వానికి తెలిసే విధంగా ఎస్సీ, ఎస్టీలు ఐక్య పోరాటం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నందుర్క ముత్తయ్య శ్రీనివాస్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.