Banawat Gobind Naik: గ్రూప్-2 వాయిదా పట్ల హర్షం: ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బానవాత్ గోవింద్ నాయక్

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
గ్రూప్-2 వాయిదా పట్ల హర్షం: ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బానవాత్ గోవింద్ నాయక్

ప్ర‌భుత్వం గ్రూప్‌-2 వాయిదా వేయ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బానవత్ గోవింద్ నాయక్ అన్నారు. సోమ‌వారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పులికల్లలో ఏర్పాటు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బానవాత్ గోవింద్ నాయక్, ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాసమొల అశోక్ మాట్లాడారు. తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2 పరీక్షను ప్రభుత్వం వాయిదాయేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన‌ట్లు తెలిపారు. ఆగస్టు 7,8 తేదీలలో జరగవలసిన గ్రూప్ 2లో ఉన్నటువంటి 738 ఉద్యోగాలకు గాను 5.51లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది అన్నారు.ఈ పరీక్షను వాయిదా వేయడం వలన నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్షా సమయం ఎక్కువగా ఉండటంతో మేధాశక్తిని పెంచుకునే సువర్ణ అవకాశం లభించిందని,దీనిని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగుల సూచనను పెద్దమనసుతో అర్థం చేసుకుని గ్రూప్ 2 పరీక్షా తేదీని పొడిగించిన ముఖ్యమంత్రి ,రేవంత్ రెడ్డి కి,తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *