సిరాన్యూస్, సైదాపూర్:
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ : బీజేపీ నాయకులు బండ శివానంద రెడ్డి
* రైతులు పండించిన పంటకు బోనస్ రూ. 500 ఏమైంది.!
తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారం చేజిక్కించుకున్నాదని బీజేపీ నాయకులు బండ శివానంద రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీతోనే దేశం అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రజలు బీజేపీ కి ఓటు వేసి బండి సంజయ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రైతులకు ధాన్యం క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించి ఇప్పుడు అమలు చేయకపోవడం రైతులను మోసం చేయడం కాదా? ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాలకు 500 తక్షణమే చెల్లించాలని అన్నారు. అదేవిధంగా రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేసి ఓట్లు అడగాలి అని డిమాండ్ చేశారు.