సిరా న్యూస్,సికింద్రాబాద్..;
కుమ్మరిగూడలోని లోని ముత్యాలమ్మ దేవాలయంలోని అమ్మవారి విగ్రహం పైన దాడి ఘటన నేపద్యంలో నేడు పలు హిందూ సంఘాలు సికింద్రాబాద్ బందుకు పిలుపు నిచ్చిన నేపద్యంలో సికింద్రాబాద్ లోని పలు హోటల్స్, వాణిజ్య సముదాయాలు తెరవకుండా స్వచ్ఛందంగా బంద్ కుసహకరిస్తున్నారు. బందుకు మద్దతుగా హిందూ సంగాలే కాకుండా పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతుండడం గమనార్హం. సికింద్రాబాద్ లోని సీతాఫలమండి, అడ్డగుట్ట, మారేడ్ పల్లి, బేగంపేట్, రాణిగంజ్ రహదారులలోని దుకాణాలన్ని బందుని పాటిస్తున్నాయి. ముఖ్యంగా నగరంలోని ప్రధాన హోటల్స్ ప్యారాడైజ్, ఆల్ఫా, కామత్, తాజ్ మహల్ హోటల్స్ కూడా తెరవకుండా స్వచ్ఛందంగా బంద్ కు సహకరిస్తున్నారు. ముఖ్యంగా బంధును తెలియచేస్తూ హిందూ సంఘాల శ్రేణులతో పాటు సామాన్య ప్రజలు సైతం బందుకు సంబంధించిన పోస్టర్ ను గురువారం నుండే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టించడంతో పాటు తమ తమ వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం గమనార్హం. ఇందులో బీజేపీ అనుబంధ సంఘాల వారితో పాటు టీడీపీ, జనసేన, బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కు చెందిన వారు కూడా ఉండడం గమనార్హం.