సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నాడు వ్యాపార సంస్థలు బంద్ పాటించాయి. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా హిందూ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో భాగంగా వ్యాపారులు స్వచ్చంధంగా బంద్ పాటించారు. బంద్ మద్దతుగా వికారాబాద్ ప్రధాన వీదుల్లో హిందూ సంఘాల భారీ ర్యాలీ నిర్వహించారు. బంద్ కు మద్దతుగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు ప్రకటించారు. పోలీసులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు.