వ్యాపార వాణిజ్య ఐఖ్యవేదిక పిలుపు
సిరా న్యూస్,పెద్దపల్లి;
: బంగ్లాదేశులోని హిందువుల పట్ల అక్కడి ముస్లీం చాందసవాదులు జరుపుతున్న దారుణాలను పెద్దపల్లి వ్యాపార, వాణిజ్య సంఘం ఐఖ్యవేధిక నాయకులు ముక్త కంఠముతో ఖండించారు. ఘోరకలికి నిరసనగా ఈ నెల 16న పెద్దపల్లి స్వచ్చంద బందుకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక కన్వీనర్ కావేటి రాజగోపాల్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్ హిందువులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. హిందువులను టార్గెట్ చేసి చంపడం, మహిళలపై అత్యాచారాలు చేస్తూ వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఏ మత ఆచారమో చెప్పాలని అక్కడి ముస్లీములను ప్రశ్నించారు. ఆ దేశంలో హిందువుల పట్ల జరుగుతున్న అరాచకాలపై ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని కోరారు. హిందువులపై దాడి జరిగితే ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగే బందులో విద్యాసంస్థలు వ్యాపార సంస్థలు ప్రతీ ఒక్క వ్యాపారుడు భాగస్వామ్యం కావాలని కావేటి రాజగోపాల్ సూచించారు. ఈ సమావేశంలో కిరాణా వర్తక సంఘం చాంబర్ ఆఫ్ కామర్స్ వివిధ విభాగాలు, కుల సంఘాలు, వివిధ విభాగాలు, సంస్థలకు చెందిన వ్యాపారులు, దుకాణాదారులు పాల్గొన్నారు.