సిరాన్యూస్, ఓదెల
నేత్రదాత బండి రామస్వామి సంస్మరణ సభ
* కుటుంబ సభ్యులకు జ్ఞాపిక అందజేత
పెద్దపల్లి జిల్లా ఓదెల నివాసి నేత్రదాత బండి రామస్వామి సంస్మరణ సభను బుధవారం సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా బంధు మిత్రులకు నేత్ర, అవయవ, శరీర దానాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి అతిథులుగామాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ , కరీంనగర్ కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు హాజరై మాట్లాడారు. నేత్రదాత కుటుంబం తీసుకున్న గొప్ప నిర్ణయం వలన ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించడం అభినందనీయమని తెలిపారు. అలాగే సదాశయ ఫౌండేషన్ అవయవ,శరీర దానాలపై చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు.ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ వారి జ్ఞాపికను కుటుంబ సభ్యులు. భార్య లక్ష్మి కుమారుడు ఆదినారాయణ భార్య మానస కూతుళ్లు అల్లుళ్లు భూమయ్య శోభారాణి సరోజన నరసయ్య మనుమలు మనమరాడ్లులకు అందజేసి ధన్యవాదాలు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో క్యాతం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు,అల్లం సతీష్,క్యాతం మల్లేశం,మేరుగు సారంగం బంధు మిత్రులు పాల్గొన్నారు.సమాజహితాన్ని కోరి నేత్రదానం చేసిన కుటుంబానికి సదాశయ ఫౌండేషన్ ముఖ్యులు శ్రవణ్ కుమార్, లింగమూర్తి, రమేష్, రామకృష్ణా రెడ్డి, చంద్రమౌళి,వాసు, పృథ్విరాజ్ అభినందనలు తెలిపారు.