సిరా న్యూస్, భీమదేవరపల్లి
భారీ భద్రత బలగాల మధ్యలో ప్రజాహిత యాత్ర
* ఎంపీకి స్వాగతం పలికిన బిజెపి శ్రేణులు
కరీంనగర్ బీజేపీ పార్టీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తలపెట్టిన ప్రజాహిత యాత్ర భారీ భద్రతా బలగాల మధ్య భీమదేవరపల్లి మండలం, మల్లారం గ్రామంలో ప్రారంభమయింది.ఈ సందర్భంగా ఎంపీకి బిజెపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. యాత్రలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం కొత్తకొండ గ్రామంలోని ప్రజాహిత యాత్రలో పాల్గొని, శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకొని, గ్రామంలోని హరిత హోటల్ లో బస చేస్తారని పార్టీ శ్రేణులు తెలిపారు.