సిరా న్యూస్, చిగురుమామిడి
ఘనంగా మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో గురువారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా కేక్ కట్ పంచి పెట్టారు . అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణ కార్యకర్త స్థాయి నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ పట్టుదల కార్యదీక్ష, సిద్ధాంతనిబద్దత ప్రతి బిజెపి కార్యకర్తకు ఆదర్శమన్నారు. భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి,మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్,గుజ్జుల రామకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.