బండి సంజయ్ హాట్ కామెంట్స్

సిరా న్యూస్;

6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా

డేట్, టైం, వేదిక మీరే నిర్ణయించండి…

నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులంతా పోటీ నుండి తప్పుకుంటారా?

కేసీఆర్.. అన్య మతస్తుల ముందు అక్షింతలు, ప్రసాదాన్ని హేళన చేస్తావా?

కుహానా లౌకిక వాదులారా… మీ నోళ్లు ఎందుకు మూతపడ్డయ్?

దుగాళ్లు..బొందుగాళ్లంటే నీ పార్టీని బొందపెట్టిన చరిత్ర కరీంనగర్ ప్రజలది

దేవుడిని నమ్మని నీ కొడుకును గుడిమెట్ల ముందు మోకరిల్లేలా చేసిన చరిత్ర హిందువులది

అసలు శ్రీరాముడంటే మీకెందుకంత కసి?

బీఆర్ఎస్ ను బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు

కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై విరుచుకుపడ్డ బండి సంజయ్

సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన పలువురు నేతలు

రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు ఇరు పార్టీల నేతల డ్రామాలాడుతూ మీడియాలో బ్రేకింగుల కోసం యత్నిస్తున్నారని మండిపడ్డారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు బండి సవాల్ విసిరారు. ‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు.. అయినా వాటిని అమలు చేసినట్లు పచ్చి అబద్దాలాడుతున్నరు. నేను మీకు సవాల్ చేస్తున్నా. వాటిని అమలు చేసినట్లు నిరూపిస్తే నేను ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటా. అవసరమైతే కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమే. నిరూపించకపోతే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థులు ఎన్నికల బరి నుండి తప్పుకునేందుకు సిద్ధమా?’’అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు తన సవాల్ ను స్వీకరించి డేట్, టైం, వేదిక నిర్ణయిస్తే.. వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.
==============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *