సిరా న్యూస్,హైదరాబాద్;
జూలై 1న రవీంద్ర భారతిలో నిర్వహించే గోర్ బంజారా జాతీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ నాయక్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సమ్మేళనంకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రుల తోపాటు గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలుl పాల్గొంటారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. .
=========================xxxx