Barampur Temple: బరంపూర్‌లో ఘనంగా గోదాదేవి కళ్యాణోత్సవం

సిరా న్యూస్, తలమడుగు:

బరంపూర్‌లో ఘనంగా గోదాదేవి కళ్యాణోత్సవం
+ భారీగా తరలివచ్చిన భక్తజనం
+ గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయం

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్‌ కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి, రంగనాథ స్వామి కళ్యాణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఏట ధనుర్మాసంలో ఈ కళ్యాణోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కాగా ఈ ఏడాది కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని వివిద గ్రామాల నుంచే కాకుండా, జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తులంత తన్మయత్వంతో చూస్తుండగా, ఆలయ అర్చకులు స్వామి వారి కళ్యాణోత్సవాన్ని భాజభజంత్రీలు, వేద మంత్రోచ్చరణల నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల కోసం మహాన్నదానం గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ముడుపు కేదారేశ్వర్‌ రెడ్డి, ఉపాద్యాక్షులు ప్రతాప్, కోశాధికారి మల్లేష్, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *