సిరా న్యూస్,నిర్మల్;
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం అమ్మవారు చంద్రఘంటా అలంకారం లో దర్శనం ఇచ్చారు.
అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంటా మాత ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన చంద్రుడు అర్ధాకృతిలో ఉండటం వల్ల అమ్మవారికి చంద్రఘంటా అని పేరు వచ్చింది. జపమాల,ఘంట, బాణం,ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది. భక్తుల కష్టాలను అతి వెంటనే నివారిస్తుంది. ఏవిధమైన భయాలు వారిని బంధింపవు. ఈ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించారు.