సిరా న్యూస్,బద్వేలు;
బద్వేలు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొజ్జ రోశయ్యకు బయనపల్లె పంచాయతీ యూత్ ముందస్తు అభినందనలు తెలిపింది మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పంచాయతీ మాజీ సర్పంచ్ నాగిరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కలిసి రోశయ్యకు అభినందనలు తెలిపారు
కూటమి అభ్యర్థి రోశయ్య విజయం కోసం వీరంతా గత కొంతకాలంగా ఎంతో కష్టపడ్డారు సోమవారం జరిగిన పోలింగ్లో ఓటర్లను సమీకరించడంలో వీరంతా కీలక పాత్ర పోషించారు దొంగ ఓట్లు పడకుండా కట్టడి చేశారు గతంలో కూటమి అభ్యర్థి బొజ్జ రోశయ్య పంచాయతీలో రెండు మూడు సార్లు ఎన్నికల ప్రచారం చేశారు అప్పుడు కూడా వీరంతా ముందు ఉండి నడిపించారు
బొజ్జ రోశయ్య ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారని మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఇదే విషయాన్ని వీరంతా వారికి చెప్పడం జరిగింది విజయం తప్పదని ఈ విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో ఓటర్లంతా కమలం గుర్తుపై ఓట్లు వేసినట్లు వారు ఆయనకు తెలిపారు బొజ్జ రోశయ్యకు అభినందనలు తెలిపిన వారిలో పిల్లి భాస్కర్ బాబు భాస్కర్ రెడ్డి సురేష్ నాగ సుబ్బారెడ్డి వెంకట సుబ్బారెడ్డి బత్తల రవి రామచంద్ర మనీ రాజేష్ సుమంత్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు
===================