సిరాన్యూస్, శంకరపట్నం:
జక్కని సంజయ్ కుమార్ను అరెస్ట్ చేయడం దారుణం : బీసీ సంఘం మండల అధ్యక్షుడు బొంగోని అభిలాష్
రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేయడం దారుణమని బీసీ సంఘం మండల అధ్యక్షుడు బొంగోని అభిలాష్ అన్నారు. సోమవారం శంకరపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జక్కని సంజయ్ కుమార్ కు యావత్ బీసీ సమాజం తరపున పూర్తి సంఘీభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఆమరణ నిరాహార దీక్ష రెండవ రోజులో భాగంగా దీక్షను కొనసాగిస్తున్నందున అయన ఆరోగ్య పరిస్థితి విషమించక ముందే ప్రభుత్వం వెంటనే ప్రకటన విడుదల చేసి కులగణన ను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో జక్కని సంజయ్ కుమార్కు సంఘీభావంగా మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు.