సిరా న్యూస్,తిరుపతి;
తుఫాన్ ప్రబావిత జిల్లాల్లో అప్రమత్తంగా వుండాలని, బాధితులకు మానవతా దృక్పదంతో అన్నిరకాలుగా ఆదుకోవాలని, నా పర్యటనలో ఎ ఒక్కరు సహాయం అందలేదు అని తెలపరాదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను , ఎస్.పి.లను ఆదేశించారు.
సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి తుఫాన్ ప్రభావిత ఎనిమిది జిల్లాల తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, ప.గోదావరి,కోనసీమ,కాకినాడ జిల్లాల కలెక్టర్లతో , ఎస్.పి.లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీచేసారు. జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, ఎస్.పి., పి పరమేశ్వర రెడ్డి, జేసి డికే బాలాజీ హాజరయ్యారు.