కౌంటింగ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి

ఏజెంట్లకు బద్వేలు తెలుగుదేశం పార్టీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి సూచన

రాష్ట్రంలో కూటమి గెలవబోతోంది

సిరా న్యూస్,బద్వేలు;

ఓట్ల కౌంటింగ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి రాష్ట్రంలో కూటమి గెలవ పోతున్నట్లు బద్వేలు తెలుగుదేశం పార్టీ యువ నేత రితేష్ కుమార్ రెడ్డి సూచించారు సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం అయ్యారు బద్వేలు పట్టణ పార్టీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళరెడ్డి అట్లూరు మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి మాజీ జడ్పిటిసి సభ్యుడు భూపాల్ రెడ్డి పార్టీ నాయకులు సుబ్బారెడ్డి బిగ్ బాస్ న్యాయవాది ఏం నరసింహులు బార్ సంగం మాజీ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది ప్రసాద్ ఇంకా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా రితేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పూర్తిస్థాయి ఫలితాలు వచ్చేవరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే కౌంటింగ్ గది నుంచి బయటికి రండి అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ కోరండి వైకాపా వారు అక్రమాలకు దాడులకు పాల్పడవచ్చు ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్ డి ఏ వైపే ఉన్నాయి గెలుపు మనదేనిని
ఆయన ధీమా వ్యక్తం చేశారు కౌంటింగ్ పక్రియ ముగిసే వరకు ఎంతో అప్రమత్తంగా ఉండాలని కోరారు బద్వేలు నియోజవర్గం ఓట్ల లెక్కింపు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు 272 పోలింగ్ కేంద్రాల్లోని ఓట్లను 20రౌండ్లలో లెక్కిస్తారు ఒక గదిలో అసెంబ్లీ మరో గదిలో పార్లమెంటు ఓట్లను లెక్కిస్తారని ఆయన తెలిపారు అసెంబ్లీ ఓట్లను లెక్కించేందుకు 14 టేబుల్లు ఏర్పాటు చేశారు పోలింగ్ రోజు 84,491 మంది పురుషులు 88,167 మంది మహిళలు ఓట్లు వేశారు ఇతరులు ఇద్దరు ఓట్లు వేశారు అలాగే 3000 మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన కోరారు బద్వేలు అసెంబ్లీకి ఎంతో కీలకమైన ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి బొజ్జ రోశయ్య గెలవబోతున్నారని రితేష్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు కౌంటింగ్ సమయంలో అనుసరించవలసిన విధానాలు తీసుకోవలసిన జాగ్రత్తల  గురించి వివరించారు అభ్యర్థి ఏజెంట్లు సమయానికి కేంద్రం వద్దకు చేరుకోవాలని చెప్పారు స్ట్రాంగ్
రూముల నుంచి ఈవీఎంలు తీసుకువచ్చే సమయంలో ప్రధాన శీలన్ని సరిగా ఉన్నాయో
లేదో చూసుకోవాలని ఏజెంట్లకు ఆయన మరీ మరీ చెప్పారు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్ డి ఏ కూటమి అధికారంలోకి వస్తున్నట్లు అన్ని సర్వే సంస్థలు చెప్పిన విషయాన్ని రితేష్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *