సిరాన్యూస్,కాల్వా శ్రీరాంపూర్
క్రైస్తవ హక్కుల రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా బెజ్జల ప్రభాకర్
క్రైస్తవ హక్కుల సంరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడిగా బెజ్జల ప్రభాకర్ నియామకమయ్యారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మోట్లపల్లి గ్రామానికి చెందిన పాస్టర్ బెజ్జాల ప్రభాకర్ ను గ్రేటర్ వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ హక్కుల సమితి బిషప్ డాక్టర్ ఫౌండర్ ,నేషనల్ ప్రెసిడెంట్ జన్ను ఇర్మియ క్రైస్తవ హక్కుల సంరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా బెజ్జాల ప్రభాకర్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో పదవిని కట్టబెట్టిన పై వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రైస్తవ హక్కుల రక్షణ కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు.