సిరాన్యూస్, బేల
బేలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో 116 వ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కదరపు ప్రవీణ్ మాదిగ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు అడ్డీకి సునీల్, జితేందర్, అంకుష్, కృష్ణ పెళ్లి అనిల్ , అశోక్ రమేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.