సిరా న్యూస్, బేల
మోడీ ప్రమాణ స్వీకారం.. బీజేపీ నాయకుల సంబరాలు
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సంబరాలు జరుపు కున్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతో మోదీ కటౌట్‌తో సంబరాలు చేపట్టారు. టపాసులు పేల్చి, స్వీట్లు తినిపించుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దత్తా నిక్కమ్, మాజీ సర్పంచ్ ఇంద్రశేఖర్, బోనిగిరివార్ గణేష్, రాము, ఉప్పల్ వార్ నారాయణ్ ధర్నే జీవన్, కృష్ణ, శంకర్, తదితరులు పాల్గొన్నారు.