bela: బేల‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

సిరాన్యూస్, బేల
బేల‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. బేల మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్బంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అభగవంతుని కోరుతున్నాను అని అన్నారు. మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికి నైతిక విజయం రాహుల్ గాంధీదేనని అన్నారు. రాబోయే రోజుల్లో భారత దేశ భావి ప్రధాని రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపుగా 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకున్న గొప్ప వ్యక్తి అని మా అగ్రనేత రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాన మంత్రి అయ్యేంత వరకు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేస్తుంటామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *