సిరాన్యూస్, బేల
బేలలో రుణమాఫీ సంబురాలు
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో లక్ష లోపు రుణాలు తీసుకున్న సుమారు 1222 మంది రైతుల రుణ ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. ఈ సందర్బంగా బేల మండలంలోని కాప్సీ బి రైతువేదికలో మండల వ్యవసాయ అధికారి, మండల ప్రత్యేక అధికారితో కలిసి రుణ మాఫీ రైతులతో సంబురాలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన్నటువంటి హామీని పూర్తి చేయడంతో ఆనంద భాష్పాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణ బకాయిలను రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ప్రణాళిక చేసింది.రేషన్ కార్డులు లేని వారికి కూడా రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.లక్ష రూపాయల వరకు రుణబకాయిలను ప్రభుత్వం ఇవాళ మాఫీ చేయనుంది.బేల మండలంలో 1222 మంది రైతుల లక్ష లోపు రుణ మాఫీ ఈ రోజు పూర్తి కావడంతో లబ్ధిదారులతో రైతువేదికల వద్ద సంబురాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.రుణమాఫీ వేళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేరుగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొగ రైతులందరూ ఆనందంతో సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో బేల మండల ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొనగా, రైతులు ఆనంద భాష్వాలు అంబరాన్ని అంటాయి.