సిరాన్యూస్, బేల
బేలలో కుక్కలు బాబోయ్ కుక్కలు
రోజు రోజుకు పెరిగిపోతున్న కుక్కలబెడదతో జనం హడలిపోతున్నారు. బాబోయ్.. కుక్కలంటూ అటు వైపు వెళ్లా లంటే వాహనదారులు సైతం భయపడిపోతున్నారు.బేలా మండల కేంద్రంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది.ప్రధాన రహదారులు,వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ రోడ్డ పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడులు చేస్తున్నాయి. అలాగే ఇళ్ల ముందు ఆడుకుంటున్న పిల్లలు, రాత్రి వేళల్లో ఇళ్ల ముందు పడుకుంటున్న వారిపై దాడి చేసి కరుస్తున్నాయి. అలాగే ద్విచక్రవాహనదారులను వెంబడిస్తున్నాయి. వీధి కుక్కల సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా పట్టించుకోలేదంటున్నారు. స్థానికులు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించాలని పలువురు వేడుకుంటున్నారు.