సిరాన్యూస్, బేల
బేలలో నేలకొరిగిన భారీ వృక్షం… తప్పిన పెను ప్రమాదం
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో గల ప్రాథమిక పాఠశాల ఆవరణలో భారీ వృక్షం నెలకొరిగింది. భారీ వృక్షం ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ సమయంలో పాఠశాల ప్రారంభం కాకపోవడం, విద్యార్థులు అక్కడికి రాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. వృక్షాన్ని బయటకు తీసేందుకు స్థానికులు శ్రమించాల్సి వచ్చింది.