Bela: బేల‌లో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

సిరాన్యూస్‌, బేల‌
బేల‌లో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆదిలాబాద్ జిలా్ల మండల కేంద్రంలోని స్థానిక కుంరం భీమ్ కాంప్లెక్స్ వద్ద రాయి సెంటర్ ఆధ్వర్యంలో కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం గిరిజన సంప్రదాయ నృత్యం చేస్తూ పలువురికి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మండల రాయి సెంటర్ అధ్యక్షుడు కోరంగే సోనేరావ్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలవుతున్నా ఆదివాసీల జీవన స్థితిగతుల్లో మాత్రం ఎటువంటి పురోగతి కనిపించడం లేదు అని పేర్కొన్నారు.ఆదివాసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనల తప్ప గిరిజనుల అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల కోసం ఎన్నో చేస్తున్నాం అని చెప్పి వారి యొక్క జీవనాధారాల మీద పొట్ట కొడుతుందని అన్నారు. ఆదివాసీలు సాగు చేసుకొనే పోడు భూములు అన్యాక్రాంతం అవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, జోవో నంబర్-03 ప్రకారం గిరిజన ప్రాంతాల్ల్లో వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకే దక్కాలన్నారు.. పోడు భూములు గిరిజనులకే దక్కేలా ప్రత్యేక చట్టం తీసుకొనిరావాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి గిరిజనులు భారీగా తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *