సిరాన్యూస్, బేల
బేలలో ఇన్‌చార్ట్‌లే దిక్కు
* ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకొస్తున్న వైనం…ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో పలు శాఖలో అధికారులు లేక ఇంచార్జులతోనే నెట్టుకొస్తున్నారు.దీంతో జనలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో పశువైద్యాధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయ అధికారి, విద్యాధికారి లేక ముఖ్య పనుల కోసం వస్తున్నప్రజలు అధికారులు లేక ఇబ్బందులు ఎదురుకొంటున్నారు.రెగ్యులర్ అధికారులు లేక పోవడంతో ప్రజలు తిరిగి వెళ్లిపోతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేయడంతో వ్యవసాయ కార్యాలయంలో రైతులు అనేక సమస్యలతో కార్యాలయంలోకి వస్తే వ్యవసాయ అధికారి లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు జిల్లా కలెక్టర్ కి విన్నవిస్తున్నారు. బేల మండలానికి పలు శాఖలకు రెగ్యులర్ అధికారులను నియమించాలని పలువురు కోరుతున్నారు.