సిరాన్యూస్, బేల
బేలలో మహంకాళి ఆలయంలో కోలాహలం
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రం సమీపంలోని మహంకాళి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు తొమ్మిది రోజుల పాటు ఇక్కడ పూజలు అందుకుంటారు.అందులో భాగంగా తొలి రోజు బేలా తో పాటు సమీపంలోని గ్రామాల భక్తులు ఉదయం 6 గంటలకు ఆలయానికి చేరుకొని ప్రత్యేక హారతి నిర్వహించి పూజలు చేస్తున్నారు. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.