సిరాన్యూస్, బేల
జిల్లా కలెక్టర్‌కి తప్పుడు నివేదిక పంపిస్తున్న బేల తహసీల్దార్
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కొబ్బయి ప్రధాన వాగు లోని ఇసుకను సంబంధిత కాంట్రాక్టర్ తీసుకెళ్లడం పట్ల గత రెండు రోజుల నుండి గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. వాగులోని మట్టిని మాత్రమే అభివృద్ధి పనుల కోసం వాడుకోవాలని జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారు. కానీ కొబ్బయి గ్రామంలోని ప్రధాన వాగులో మట్టిని కాకుండా అందులోని ఇసుకను మహారాష్ట్ర ,తెలంగాణ అంతరాష్ట్ర రహదారి 353బి నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు అని గ్రామస్థుల ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన పూర్తి వివరాలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నివేదిక పంపించాలని బేల మండల తహసీల్దార్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు తాము అడ్డు రాము కానీ ప్రధాన వాగులోని ఇసుకను జేసీబీ ల సహాయంతో తీసుకెళ్లడంతో వాగు పక్కన ఉన్న వ్యవసాయ భూమాలకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఇచ్చినట్టు వంటి పర్మిషన్ లెటర్ లో కూడా స్పష్టంగా హైడ్రోలిక్ యంత్రాలను ఉపయోగించి ఇసుకను తీసుకెళ్లారాదు కేవలం మట్టిని మాత్రమే తీసుకెళ్లాలని కానీ ఇవ్వని రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుకను తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఏజన్సీ గ్రామాల్లో ఇసుకను తీసుకెళ్లడం పిసా 1/70 చట్టానికి విరోద్దాం అని అన్నారు.దింతో పాటు బేల తహసీల్దార్ జిల్లా కలెక్టర్ కు కొబ్బయి వాగు నుండి కేవలం మట్టిని మాత్రమే తీసుకెళ్తున్నారని, గ్రామస్తులు కావాలని అడ్డు కుంటున్నారు తప్పుడు నివేదిక సమర్పించడం చాలా విడ్డురంగా ఉందని అన్నారు.క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండానే తహసీల్దార్ తప్పుడు నివేదిక ఇవ్వడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.