సిరాన్యూస్, బేల
ఊరూరా హనుమాన్ జయంతి వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పలు గ్రామాల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలతో ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.మండలంలోని సిర్సన్న గ్రామపంచాయతీ సమీపాన సింగపూర్ గ్రామంలో అంజన్న భవ్య ఆలయం కొలువై ఉంది. భక్తులు ఈ ఆలయానికి పుణ్యక్షేత్రంగా భావిస్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలి వెళ్లారు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ దీక్షపరులు స్వామివారి పరిధిలో దీక్ష విరమణ చేశారు. మొక్కులు తీర్చుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు, మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.