సిరాన్యూస్, బేల
ఈనెల 13 వరకు జొన్న పంట కొనుగోలు బంద్
ఈనెల 13వరకు ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో జొన్న పంట కొనుగోలు నిలిపి వేస్తున్నట్లు మార్కెట్ యార్డ్ అధికారి తెలిపారు. జొన్న పంటలు అధికం ఉండడం తో మార్కెట్ యార్డ్ మొత్తం నిండి పోయిందని తెలిపారు. అదే విధంగా వర్ష సూచన, ఎన్నికలు ఉన్నందున ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు జొన్నల కొనుగోలు నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు.. తిరిగి ఈనెల 14న ప్రారంభమవుతుందని, గ్రామాల వారీగా రైతులు యధావిధిగా పంటను తీసుకురావచ్చని తెలిపారు. ఈ విషయాన్ని బేలా మండల రైతులు గమనించి సహకరించాలని కోరారు.