bela: అంతా మా ఇష్టం

సిరాన్యూస్, బేల‌
అంతా మా ఇష్టం
* నాణ్య‌త‌కు తిలోద‌కాలు
* ఇష్ట‌రాజ్యంగా జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ ప‌నులు
* పాఠ‌శాల నిర్మాణ ప‌నుల్లో నాణ్య‌త‌కు తిలోద‌కాలు

మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనుల‌పై స‌మీక్ష‌లు చేయ‌డ‌మే కాదు.. ఒక‌సారి క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీలు చేయండి.. ప‌నులు ఎలా చేస్తున్నారో తెలుస్తుంది. నాణ్య‌మైన ప‌నులు చేసిన‌ట్లు క‌నిపించ‌డం లేదు.పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించరాదని, పక్కాగా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించినా ప‌ట్టించుకోవ‌డం లేదు. పైన ప‌టారం.. లోనే టొటారం అన్న చందంగా పాఠ‌శాల ప‌నులు కొన‌సాగుతున్నాయి. వీటినైనా నాణ్యంగా ఉండేలా చూడాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనుల్లో కొన‌సాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు మన ఊరు మన బడి కింద చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించింది. కాంట్రాక్టర్ల పనితీరు నిర్లక్ష్యంగా మారింది.లక్షల వ్యయంతో టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ఇష్టరాజ్యంగా చేపడుతున్నారు. చేస్తున్నటువంటి పనుల్లో సిమెంట్,ఇటుకలు ఫర్నిచర్ అక్కడక్కడ బోసిపోయి కనిపిస్తుంది. ఇటువంటి ఎన్నో నాసిరకంగా నాణ్యతలేని వస్తువులు ఉన్నాయి.కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం ప్రారంభానికి ముందే గోడలు పగిలి పోతున్నాయి. ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి పాఠ‌శాల నిర్మాణంలో నాణ్య‌త పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు కోరుతున్నారు.


అధికారులు ప‌ర్య‌వేక్ష‌ణ చేప‌ట్టాలి… ( ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మాడావార్ హరీష్ రెడ్డి)
బేల మండల కేంద్రంలో చేపడుతున్న పనుల్లో కాంట్రాక్టర్, గుత్తే దారులు ఇష్టరాజ్యంగా చేపడుతున్నారు.అధికారుల పర్యవేక్షణ లేకనే ఇష్టం వచ్చినట్లు పనులు చేస్తున్నారు. వెంటనే అధికారులు సందర్శించి పనులను చూడాలి. లేని యెడల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *