Bela Anganwadi Centre: శిథిలావస్థలో అంగన్‌వాడీ కేంద్రం.. త‌హ‌సీల్దార్‌కు విన‌తి

సిరాన్యూస్‌, బేల‌
శిథిలావస్థలో అంగన్‌వాడీ కేంద్రం.. త‌హ‌సీల్దార్‌కు విన‌తి

ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం -3 పూర్తిగా శిథిలావస్థ గా ఉంది. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని భయం భయంతో తరగతులను నిర్వహిస్తున్నారు.ఈ కేంద్రానికి జిల్లా కలెక్టర్ కూడా సందర్శించి కేంద్రాన్ని వెంటనే మార్చాలని మండల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంగ‌ళ‌వారం ఈ సందర్బంగా మండల కేంద్రంలోని 3వ సెంటర్ అంగన్‌వాడీ టీచర్ పోషకులతో కలిసి తహసీల్దార్ కి వినతి పత్రం ఇచ్చారు.దీంతో తహసీల్దార్ సవాయ్ సింగ్ అంగన్వాడీ కేంద్రాన్ని ప‌రిశీలించారు. భారీ వర్షం వస్తే కేంద్రంలో పూర్తిగా నీళ్లు వస్తుందని అంగన్వాడీ టీచర్ తహసీల్దార్ కి వివరించారు.వెంటనే తహసీల్దార్ కేంద్రాన్ని వేరే చోట మార్చాలని సంబంధిత అధికారులకు తెలియజేసారు.ఈ సందర్బంగా బేల మండల తహసీల్దార్ సవాయ్ సింగ్ మాట్లాడుతూ అంగన్వాడీ భవనం పూర్తిగా శిథిలావస్థలో ఉండడంతో వెంటనే ఇక్కడ ఉన్న పిల్లలను వేరే భవనంలోకి మార్చాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు.నూతన భవనం పూర్తయ్యే వరకు అంగన్వాడీ కేంద్రాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ పంచాయతీ కారోబార్, అంగన్వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *