సిరాన్యూస్, బేల
సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అనివేశ్ రెడ్డిని కలిసిన బేల కాంగ్రెస్ నాయకులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అనివేశ్ రెడ్డిని ఆదిలాబాద్ జిల్లా బేల కాంగ్రెస్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌ను మండల కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రాందాస్ నాక్లే, కిసాన్ సెల్ అధ్యక్షుడు గన్షం గవండే, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రూపేష్ రెడ్డి, సాగర్ ఠాక్రే, బొక్రె శంకర్, అవినాష్ బెదొడ్కర్, తదితరులు ఉన్నారు.