సిరాన్యూస్, ఆదిలాబాద్
పాలకొండ శ్రీకాంత్ కు ఘనంగా సన్మానం
ఆపద సమయంలో ఆదుకున్న బెస్ట్ ఫ్రెండ్ వెల్ఫేస్ సొసైటీ అదిలాబాద్ వైస్ ప్రెసిడెంట్ పాలకొండ శ్రీకాంత్ కు ఘనంగా సన్మానించారు. బుధవారం నిర్మల్ జిల్లాలో నిర్మల్ సామాజిక సీనియర్ సేవకుడు నిగులపు సంజీవ్ కుమార్, పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన సామాజిక సేవకుడు అజార్ ఖాన్, రాథోడ్ అనిల్‌లు పాలకొండ శ్రీకాంత్‌ను సన్మానించారు. ఈసందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రత్యేకంగా అందరకి ధన్యవాదాలు తెలిపారు. మీ సాయం సహకారంతోని నేను ఈ లోకంలో మళ్లీ రావడం జరిగిందని ఒక ఉదాహరణ తో చెప్పడం జరిగింది. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.