సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్ఫూర్తివంతమైన ఫలితాలు ఇస్తున్నారని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యూనిఫామ్స్, నోట్ బుక్స్ ను తార్నాక డివిజన్ లోని జమా ఈ ఉస్మానియా ఓయూ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంపిణీ చేసారు.
శ్రీలత మాట్లాడుతూ పాఠశాలలో శానిటేషన్ మరియు టాయిలెట్ పరిశుభ్రత కోసం జీహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికులతో ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తూ విద్యార్థులకు చదువుకోవడానికి మంచి వాతావరణం కలిగేలా చూస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే ఈరోజు వివిధ రంగాల్లో గొప్ప స్థాయిలో ఉంటూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కూడా బంగారు భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. ఓయూ పరిధిలో ఉన్న తొమ్మిది బస్తిల్లో నివసిస్తున్న ఇంకా మరేంతో మంది పేద విద్యార్థులకు ఈ పాఠశాల ద్వారా నాణ్యమైన విద్యనందిచాలని, మెరుగైన ఫలితాలు రావాలని కోరారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, స్థానిక నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
===============