సిరా న్యూస్,కడప;
ఉమ్మడి కడప మండలం లోని పలు గ్రామాలలో వివిధ రకాల పంటలు సాగుచేసిన రైతులు తుఫాన్ దాటికి తీవ్రంగా నష్టపోయారు. కోసిన వరి పంట ధాన్యం కుప్పలు పొలాల్లోనే ఉండిపోయాయి. ధాన్యం రంగు మారతాయోనన్న భయం రైతులు ఉన్నది. మరికొన్నిచోట్ల వరి పంట పూర్తిగా నేలకొరిగి వర్షపు నీటిలో మునిగిపోవడంతో ఎక్కడ మొలకలు వస్తాయో నన్న ఆందోళన నెలకొంది. దీంతో రైతుల దిక్కుతోచని స్థితిలోకొట్టుమిట్టాడుతున్నారు. కొన్ని రోజులుగా ముసురుగా ఉండటం మొన్నటి నుండి ఏకతాటిగా వర్షం పడుతుండడంతో సాగుచేసిన టమోటా మిరప రైతుల పరిస్థితి అగమగోచరంగా తయారైంది. ఉమ్మడి జిల్లాలోని రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి తదితర ప్రాంతాల లోని ఉద్యానవన హోటల్ భారీగా దెబ్బతిన్నాయి పులివెందుల నియోజకవర్గంలో పలు మండలాల్లో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు . తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కునేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.