సిరా న్యూస్, జైనథ్
జైనథ్ మార్కెట్ యార్డ్ ను సందర్శించిన కలెక్టర్
* సమస్యలను విన్నవించిన బీజీఆర్
ఆదిలాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రాజర్షి షా వెంటనే జిల్లాలో పర్యటన మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మార్కెట్ యార్డును బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, పిఏసీఎస్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి లు కలెక్టర్ కు అక్కడి పరిస్థితి ని వివరించారు. మార్కెట్ కమిటీ లో నిర్మించిన షెడ్లకు పైకప్పులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా జైనత్, బేల మార్కెట్ యార్డుల్లో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని గోవర్ధన్ రెడ్డి కలెక్టర్ ను కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్ త్వరలో ఈ పనులు పూర్తి అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.ఎం, ప్రవీణ్, ఎడి పుల్లయ్య, మార్కెట్ కార్యదర్శి మధుకర్ తదితరులు ఉన్నారు.