BGR: రైతులకు రెండున్నర కోట్ల ఆదాయం:  బీజీఆర్‌

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
రైతులకు రెండున్నర కోట్ల ఆదాయం:  బీజీఆర్‌

ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు తాము పండించిన సోయాబీన్ పంటను ప్రైవేట్ దళారులకు కాకుండా, నాఫెడ్ ద్వారా ప్రభుత్వానికి అమ్మడంతో రెండున్నర కోట్ల ఆదాయం లభించిందని జైనథ్ పిఎసిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన సోయాబీన్ పంట ను కొనుగోలు చేయాలని కోరడంతో కేంద్ర ప్రభుత్వాలకు విన్నవించగా ఇటీవల నాఫెడ్ ద్వారా కొనుగోలు చేపట్టగా ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో దాదాపు 60 వేల క్వింటాళ్ల సోయాబీన్ మార్కెట్ కు తీసుకువచ్చి అమ్ముకోవడం జరిగిందన్నారు. ఒక్క జైనథ్ మండలం నుండి 36 వేల క్వింటాళ్ల సోయాబీన్ కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొనుగోలు విషయాన్ని రాద్ధాంతం చేసి పైశాచిక ఆనందాన్ని పొందారని ధ్వజమెత్తారు. దాదాపు 27 కోట్ల సోయాబీన్ కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా రైతుబంధు పడడం లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఇప్పటికే ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులు తమ ఖాతాలు పడ్డాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *