సిరాన్యూస్, జైనథ్
సమస్య పరిష్కారంపై ఏఈఈకి ధన్యవాదాలు : బీజీఆర్
ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సమస్య నెలకొన్న దృష్ట్యా వాటర్ గ్రిడ్ ఏఈఈ కి తెలిపిన వెంటనే రెండు గంటల్లోనే సమస్యను పరిష్కరించినందుకు ఏఈఈకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మాంగూర్ల నుండి సుమారు 20 గిరిజన గ్రామాలకు నీటి సరఫరా చేసే మెయిన్ లైన్ లో నెలకొన్న సమస్యను గ్రామస్తులు తనకు వివరించారు. తాను వెంటనే వాటర్ గ్రిడ్ ఏఈఈకి తెలపగా, మరమ్మతు చేసి సమస్యను రెండు గంటల్లో పరిష్కరించారని తెలిపారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు.