సిరా న్యూస్;
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ పొంది రేపు వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది “భజే వాయు వేగం” సినిమా. ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. తెలంగాణ పల్లెలోని ఓ తండ్రి కోసం ఇద్దరు కొడుకులు పడే ఆరాటం ఈ సినిమాకు నేపథ్యం. చాలా రోజుల తర్వాత కథలో వెరీ ఇంపార్టెంట్ రోల్ చేశాను. “భజే వాయు వేగం” సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్, యూవీ సంస్థకు కృతజ్ఞతలు. హీరో కార్తికేయ వినయం ఉన్న వ్యక్తి. జయాపజయాలు ఎవరికైనా సహజం కానీ వ్యక్తిత్వం మాత్రం మారకూడదు. కార్తికేయను ఆయన వ్యక్తిత్వమే కాపాడుతుందని భావిస్తున్నా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైలాగ్ రైటర్ మధు శ్రీనివాస్ మాట్లాడుతూ – హనుమంతుడికి తన శక్తి తనకు తెలియనట్లు. మనకు మన శక్తి తెలియదు. అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడతాం. “భజే వాయు వేగం” సినిమాలో హీరో కూడా అంతే తన శక్తి తనకు తెలియదు. కానీ సమస్య వచ్చినప్పుడు తనకన్నా బలవంతులైన విలన్స్ తో పోరాటం చేస్తాడు. ఈ సినిమాలో నేను భాగమవడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ ప్రశాంత్, హీరో కార్తికేయ, యూవీ బ్యానర్ కు థ్యాంక్స్. అన్నారు.
ఎడిటర్ సత్య జి మాట్లాడుతూ- రన్ రాజా రన్ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ప్రశాంత్, ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ లో నేను పనిచేశాం. “భజే వాయు వేగం” సినిమాకు దర్శకుడిగా తను, ఎడిటర్ గా నేను వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. యూవీ సంస్థలో మూవీ చేసే అవకాశం వచ్చినందుకు గర్వపడపడుతున్నా. అన్నారు.
లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ – జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాట రాసినప్పుడు మీరు బాగా యూత్ అయి పోయారే అని అన్నారు. ఇప్పుడు “భజే వాయు వేగం” సెట్టయ్యిందే పాటకు కూడా అలాంటి మంచి పేరు వస్తోంది. “భజే వాయు వేగం” సినిమా టైటిల్ లోనే ఒక పాజిటివ్ నెస్ ఉంది. ఈ మధ్య థియేటర్స్ కు జనం రావడం లేదు అంటున్నారు. మంచి సినిమా చూడాలనే ప్రేక్షకుల కరువును ఈ సినిమా తీర్చాలని కోరుకుంటున్నా. అన్నారు.యాక్టర్ నాగ మహేశ్ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమాలో మా గురువు తనికెళ్ల భరణి గారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. విలన్ రోల్ లో ఈ చిత్రంలో కనిపిస్తాడు. ఈ సినిమా విజయపథంలో దూసుకెళ్లాలని కోరుకుంటున్నా. అన్నారు.
యాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమాలో మంచి క్యారెక్టర్ చేశా. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు కార్తికేయ పర్ ఫార్మెన్స్ అలా చూస్తూ ఉండిపోయా. అంత బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఈ సినిమా కార్తికేయకు మా డైరెక్టర్ ప్రశాంత్ మిగతా టీమ్ అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలి. అన్నారు.
యాక్టర్ సుదర్శన్ మాట్లాడుతూ – నా మొదటి సినిమా రన్ రాజా రన్. ఆ సినిమాకు ప్రశాంత్ వర్క్ చేశాడు. ఇప్పుడు “భజే వాయు వేగం” మూవీతో డైరెక్టర్ గా మారుతున్నాడు. ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. మా కార్తికేయకు కూడా ఈ సినిమా బిగ్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
బీజీఎం ఇచ్చిన కపిల్ కుమార్ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమా ప్రతి ఫ్రేమ్ పర్పెక్ట్ గా ఉంటుంది. డైరెక్టర్ అలా తీశారు, ఎడిటింగ్ అంత బాగా వచ్చింది. ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ లు ఇంప్రెసివ్ గా ఉంటాయి. అందుకే ఇంతమంచి బీజీఎం “భజే వాయు వేగం” సినిమాకు చేయగలిగాను. అన్నారు.
డైరెక్టర్ మేర్లపాక గాంధీ మాట్లాడుతూ – ప్రశాంత్ మంచి టైటిల్ ఉంటే చెప్పన్నా అని అడిగేవాడు. తన సినిమాకు “భజే వాయు వేగం” వంటి మంచి టైటిల్ పెట్టుకున్నాడు. ఈ 31తో ప్రశాంత్ లైఫ్ మారిపోతుంది. మంచి పార్టీ చేసుకుందాం. కార్తికేయ కష్టం ఈ సినిమా ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తోంది. కార్తికేయకు, హీరోయిన్ ఐశ్వర్యకు నా బెస్ట్ విశెస్ చెబుతున్నా. ఈ ఈవెంట్ కు నేను వచ్చేందుకు యూవీ సంస్థ కారణం. ఈ సినిమా వంశీ, ప్రమోద్, విక్కీ అన్నకు మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ క్లాక్స్ మాట్లాడుతూ – బెదురులంక మూవీ చేసిన తర్వాత కార్తికేయ నాకొక బ్రదర్ లా మారారు. “భజే వాయు వేగం” తో ఆయనకు పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ప్రశాంత్ నా ఫ్రెండ్. మేము క్రికెట్ ఆడుతుంటాం. ఆయన ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావాలని ఆశిస్తున్నా. అన్నారు.