Bhargav Deshpande: భార్గవ్ దేశ్ పాండే పై సస్పెన్షన్ ఎత్తివేత…!?

సిరా న్యూస్, ఆదిలాబాద్:

భార్గవ్ దేశ్ పాండే పై సస్పెన్షన్ ఎత్తివేత…!?

– ఉత్తర్వులు జారీ చేసిన చిన్నారెడ్డి

గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో డిసిసి మాజీ అధ్యక్షులు భార్గవ్ దేశ్ పాండే ను కాంగ్రెస్ పార్టీ ఆరేళ్లపాటు పార్టీ నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం వైస్ ఛైర్మన్, పార్టీ రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం అధ్యక్షులు డా. జిల్లెల చిన్నా రెడ్డి భార్గవ్దేశ్ పాండే పై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. చిన్నారెడ్డి స్వయంగా భార్గవ్ దేశ్ పాండే కు సస్పెన్షన్ ఎత్తివేత ఉత్తర్వులు అందజేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయం ఆదిలాబాద్ కాంగ్రెస్ పలు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా సైట్ లలో వైరల్ గా మారింది. అయితే భార్గవ్ దేశ్ పాండే మీద సస్పెన్షన్ ఎత్తివేసినట్లు వస్తున్న వార్తలు ఫేక్ అంటూ పార్టీలోని ఒక వర్గం వారు ప్రచారం చేయగా, మరికొంతమంది భార్గవ్ దేశ్ పాండే పై సస్పెన్షన్ ఎత్తివేడాన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పటికే డిసిసి పదవి కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ కొనసాగుతుండగా, భార్గవ్ దేశ్ పాండే పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో కొత్త అలజడి మొదలైంది. ఈ పరిణామాలు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసొచ్చిన, రాకపోయినా ఆదిలాబాద్ కాంగ్రెస్ లో సమీప భవిష్యత్తులో మాత్రం వర్గపోరు తప్పదని పలువురు విశ్లేషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *