సిరాన్యూస్, భీమదేవరపల్లి
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
భీమదేవరపల్లి క్రాస్ వద్ద శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను అంబేద్కర్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభాధ్యక్షులు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ కమిటీ చైర్మన్ కరుణాకర్, ముఖ్య అతిధులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిట్టెం పెళ్లి అయిలయ్య, మాజీ ఎన్ఎస్ యు జిల్లా అధ్యక్షులు కొలుగూరి రాజు హాజరై మాట్లాడారు.వారి దేశం కోసం అనేక ఉద్యమాలు చేశారన్నారు. కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు గజ్జల రమేష్ , వరంగల్ నగర అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తూముల సదానందం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డబ్బా శంకర్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు సాగంటి వెంకటేశ్వర్లు , ఎలుక పెళ్లి శ్రీనివాస్, సాతూరి చంటి, పచ్చునూరి సురేషు సాతూరి చిరంజీవి, ఎర్ర రాజేష్, సాతురి సదానందం పాల్గొన్నారు