Bhimadevarapalli: భీమదేవరపల్లిలో ఘ‌నంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

సిరాన్యూస్, భీమదేవరపల్లి
భీమదేవరపల్లిలో ఘ‌నంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

భీమదేవరపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ వ‌ద్ద బుధవారం తెలంగాణ రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి సదానందం గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేక్ కటింగ్ చేశారు. అనంత‌రం గ్రామంలో సీట్లు పంపిణీ చేశారు.అనంత‌రం వారు మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.హుస్నాబాద్ నియోజకవర్గం అంచలంచెలుగా అభివృద్ధి చేస్తారని కొనియాడారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డబ్బా శంకర్, మాచర్ల సదానందం గౌడ్, చాగంటి వెంకటేశ్వర్లు, పచ్చనూరు కరుణాకర్, పాతూరి వెంకటయ్య, మొగిలి శ్రీనివాస్, ఎర్ర రాజేష్, సంపత్ గబట మొగిలి కొమురయ్య, చిరంజీవి కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *