Bhimadevarapalli: భార్య కాపురానికి రావడం లేదని భ‌ర్త ఆత్మహత్య

సిరాన్యూస్‌, భీమదేవరపల్లి
భార్య కాపురానికి రావడం లేదని భ‌ర్త ఆత్మహత్య

భీమదేవరపల్లి మండలం మాణిక్యా పూర్ గ్రామానికి చెందిన ఓల్లాల మహేందర్ గౌడ్ ఆత్మ‌హత్య చేసుకున్నాడు. ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం. మాణిక్యా పూర్ గ్రామానికి చెందిన ఓల్లాల మహేందర్ గౌడ్ భార్య జ్యోతి మధ్య కుటుంబ కలహాల కారణంగా భార్య జ్యోతి పుట్టింటికి వెళ్లిపోయింది. గత మూడు నెలలుగా భార్య కాపురానికి రాకపోవడంతో మహేందర్ మద్యానికి బానిస అయ్యాడు.ఎన్నిసార్లు తిరిగి రావాలని భార్యను కోరిన రాకపోవడంతో మనస్థాపం చెంది ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎమ్ఎంజీఎం కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. మృతుడి తండ్రి తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *