సిరాన్యూస్, బోథ్
ఆయుధాల పనితీరును పరిశీలించిన అధికారులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఆయుధాలను స్పెషల్ టీం ఏ ఆర్ ఎస్ ఐ ఆర్ భీమ్రావు నాయక్ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. ప్రతి నెల ఈ విధమైన తనిఖీల నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఆయుధాల పరిధిలోతో పాటు అవసరమైన మరమ్మతులు సైతం చేయడం జరుగుతుందన్నారు. అవసరమైతే అప్పటికప్పుడే మరమ్మతులు చేసేందుకు సిబ్బంది ఉన్నారని ఆయన తెలిపారు. సోమవారం గుడిహత్నూర్, బజార్‌హత్నూర్, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో పరిధిలోని ఆయుధాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు.