సిరాన్యూస్,సైదాపూర్:
బూడిదపల్లిలో కూలిన పురాతన శివాలయం గోపురం
దేవాదాయ శాఖ నుండి సహకారం అందించాలి
* ఆలయ కమిటీ ఛైర్మెన్ అనగోని రమేష్ గౌడ్
సైదాపూర్ మండలం బూడిదపల్లి గ్రామంలో ప్రసిద్ధి గాంచిన శివాలయం గోపురం గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కూలిపోయింది. ఈ ఆలయానికి ధూప దీప నైవేద్యం ప్రభుత్వ సహాయ సహకారాలు అందుతున్నాయి. ఆలయ గోపురాన్ని ఆలయ కమిటీ చైర్మన్ అనగోని రమేష్ గౌడ్ సందర్శించి పరిశీలించారు. స్వయంగా ఆలయ గోపురాన్ని పునరుద్ధరించి తాత్కాలికంగా లోపలికి నీరు వెళ్లకుండా మరమ్మత్తులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని ఆలయ గోపురాన్ని పునర్నిర్మానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున సహాయ సహకారాలు ఆలయానికి అందించాలని కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, పాకాల రమేష్ గౌడ్, అనగోని శ్రీనివాస్, పెరుమాండ్ల సురేష్, అనగోని మహేష్, బత్తిని రాములు, అనగోని అఖిల్ తదితరులు ఉన్నారు.