సిరాన్యూస్, పెంబి
బీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి : భూక్యా జాన్సన్ నాయక్
* పెంబిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
బీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమని ఖానాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఖానాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు అభివృద్ధిలో బిఆర్ఎస్ పార్టీ ముందుందని, కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేందుకు మాత్రమే ఉందని అన్నారు. ఐదు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు అమలు కాలేదు అన్నారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులతో కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ అమలు చేసిన పథకాలను గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని, పేద ప్రజల ఆదుకున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆత్రం సక్కు అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పెంబి మండల అధ్యక్షుడు చల్ల నరేందర్ రెడ్డి, సర్పంచులు శేఖర్ గౌడ్, సుధాకర్, మహేందర్, ఎంపీపీ భూక్యా కవిత-గోవింద, వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, ఎంపిటిసి రామారావు, గ్రామ అధ్యక్షుడు సుతారి మహేందర్, గాండ్ల శంకర్, సతీష్, నరేందర్, ఇస్మాయిల్, సరోజ, ప్రజా ప్రతినిధులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.