సిరాన్యూస్,ఆదిలాబాద్
టీపీసీసీ మీడియా సమన్వయకర్తగా భూపెల్లి శ్రీధర్
* ప్రజా సేవాభవన్ లో అభినందించిన కంది శ్రీనివాస రెడ్డి
* శాలువా కప్పి ఆత్మీయ సత్కారం
టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ సమన్వయకర్తగా నియమితులైన డీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు భూపెల్లి శ్రీధర్ ను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి అభినందించారు.పట్టణంలోని ప్రజా సేవాభవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలోశాలువాతో సత్కరించారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికి తప్పకుండా తగిన గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. అటు భూపెల్లి శ్రీధర్ తనపై నమ్మకంతో మీడియా సమన్వయకర్తగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు శాయ శక్తులా కృషి చేస్తానని అన్నారు.