నాయకులకు ఘన స్వాగతం
భారీగా ర్యాలీగాచెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలి
రక్తదాన శిబిరాలను తరలి వచ్చిన నాయకులు, అభిమానులు
సిరా న్యూస్,కౌతాళం;
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పర్యటక శాఖ, మంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా సోమవారం కుటమి ఆదేశాలు మేరకు జనసేన రామాంజనేయులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను తరలి వచ్చి రక్తదానం అందించారు. నాయకులకు భారీగా ర్యాలీగా వెళ్లి ఘన స్వాగతం పలికారు. జిల్లా ఉన్నత పాఠశాలలో చెట్లు నాటి పర్యవరానన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఎంపీడీవో కార్యాలయంలో రక్తదానం శిబిరాలను ఏర్పాటు చేశారు. మండల నాయకులు వెంకటపతి రాజు రాకేష్ రెడ్డి సతీష్ నాయుడు, చౌదరి బసవ, అక్కంతోట రామకృష్ణ ,నవరామ కాంత్ రెడ్డి, టిప్పు సుల్తాన్, తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జయప్రదం చేశారు.. అన్ని గ్రామాల్లో జనసేన అభిమానులు పండుగ వాతావరణం నెలకొంది .అని అందరూ మానవత్వం తరలి వచ్చి రక్తదాన శిబిరాలను జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ అన్ని దానాలకంటే అన్నదానం గొప్పదని కానీ నేడు అన్ని దానాలకంటే ప్రాణదానం ఎంతో మిన్న అని నాయకులు తెలిపారు. మన డిప్యూటి సీఎం ప్రజల మనిషి అని సంక్షేమ నికి పాటుపడే వ్యక్తి అన్ని విధాల సహాయసహకారాలు అందించే వ్యక్తి అని ఆనందాన్ని వ్యక్తం చేశారు.ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం ఇచ్చి మానవత్వం చాటుకోవలని మండల నాయకులు పిలుపు నిచ్చారు..అనంతరం మండల కార్యాలయంలో కేక్ ను కట్ చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. రక్త దానం చేసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో మండల నాయకులు కురువ వీరేష్, నీలకంఠ రెడ్డి, సురేష్, గిరి,జనసేన నాయకులు, రాంబాబు హనుమేష్ గణేష్ ,రాజు ,హుసేని, మహమ్మద్, రాజా నంద, ముకయ్య. వలి, నబి, లింగెష్, మరియు కూటమి నాయకులు భారీ ఎత్తున కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.